MBNR: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పంచాయతీలలో సర్పంచులు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించాలన్న నిబంధన ఉంది. ఈ సందర్భంలో వారి నుండి ఇంటి పన్నులు, నల్ల పన్నులు, ఇతర పన్నులను పంచాయతీ కార్యదర్శులు జమ చేసుకొని తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.