JGL: మేడారం మహా జాతర జనవరి 28, 29, 30, 31వ తేదీల్లో జరగనుంది. ఈ జాతరకు 20 రోజుల ముందు నుంచే భక్తులు పోటెత్తుతారు. వేలాది వాహనాలు బారులు తీరుతాయి. హైదరాబాద్-భూపాలపట్నంను కలిపే 163 జాతీయ రహదారిపై టోల్ గేట్ల వద్ద ఈసారి కూడా ఆ 4 రోజులు ఉచిత ప్రయాణం అమలు కానున్నట్లు సమాచారం. టోల్ ఛార్జీలు చెల్లించే సమయంలో వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.