PLD: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.