TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పంచమి తీర్థం(చక్రస్నానం) అంగరంగ వైభవంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు మండపం వద్ద సారె సమర్పించారు. అనంతరం పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించారు.