NLG: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసి ప్రాజెక్టులో మంగళవారం 19 లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. గెస్ట్ హౌస్కు మరమ్మతులు చేపడతామన్నారు.