భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, భారత్ ముందు 548 పరుగుల భారీ టార్గెట్ను ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 14, రాహుల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. చివరి రోజు ఆటలో IND విజయానికి 522 పరుగులు, SAకు 8 వికెట్లు కావాలి.