MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని అగ్రహారం పొట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ కుమారుడు గిరి ప్రసాద్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గిరి ప్రసాద్‌ను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడలలో విజయాలు సాధించాలన్నారు.