NZB: నగరానికి చెందిన దివ్య, ప్రజ్ఞ అనే ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ తొలిసారిగా అయ్యప్పస్వామి మండల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయంలో రమేష్ పంతులు వీరికి మాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం దీక్ష చేపట్టామన్నారు. ఇక్కడ అందరూ తమను ఎలాంటి వివక్ష లేకుండా ఆదరిస్తున్నారని చెప్పారు.