HYD: iBOMMA రవి బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయని ఆయన న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. ఒక్క కేసులో రిమాండ్ విధించగా, మిగతా నాలుగు కేసుల్లో పీటీ వారెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కస్టడీలో పోలీసులకు రవి సహకరించలేదని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు.