TG: స్వరాష్ట్రం ఏర్పడిన నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. చెక్ డ్యాంల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాసిరకం పనులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు.