హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల బాలుడికి ఇద్దరు టీచర్లు దారుణమైన శిక్ష విధించారు. ఆ బాలుడిని చెట్టుకి వేలాడదీశారు. ఈ దారుణ ఘటన చత్తీస్‌గఢ్ నారాయణ్‌పుర్‌లోని హంసవాణి విద్యామందిర్‌లో జరిగింది. దీంతో గ్రామస్థులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆ జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.