NLG: దేవరకొండని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా కేంద్ర సమన్వయకర్త శివశంకర్ హాజరై ధ్యానం ద్వారా ఒత్తిడి ఎలా తగ్గించాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సుంకర రమేష్, స్టూడెంట్ కౌన్సిలర్ బి.సైదులునాయక్, అధ్యాపకులు సాయిలు, పార్థసారథి, శ్రీదేవి, జయప్రకాష్ పాల్గొన్నారు.