మూవీ టికెట్ ధరలపై జరుగుతున్న చర్చపై నిర్మాత SKN స్పందించాడు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, థియేటర్ యాడ్స్‌తో నిర్మాతకు ఎలాంటి సంబంధం ఉందన్నాడు. మల్టీప్లెక్స్‌లో ఒక ఫ్యామిలీ దాదాపు రూ.2200 ఖర్చు పెడితే అందులో నిర్మాతకు కేవలం 17 శాతం మాత్రమే దక్కుతుందని తెలిపాడు. ఈ మేరకు టికెట్ల విక్రయాల నుంచి నిర్మాతకు ఎంత శాతం వస్తుందో తెలియజేసేలా ఓ ఫొటో పంచుకున్నాడు.