AP: ఉద్భవ్ -2025 పేరుతో డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి ఉత్సవాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను సచివాలయంలో మంత్రి సంధ్యారాణి ఆవిష్కరించారు. డిసెంబర్ 3,4,5 తేదీల్లో పోటీలు వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు.