VZM: విజయనగరం టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య, అసంబద్ధ ఆరోపణలను ఆయన ఖండించారు. బోగాపురం ఎయిర్పోర్ట్ మీద రిపీటెడ్ గా మాట్లాడటం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్లేనని అన్నారు.