AP: మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని మంత్రి లోకేష్ అభినందించారు. విద్యార్థిని కుటుంబసభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. 8వ తరగతి విద్యార్థిని కనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. దీంతో మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు.