AP: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీకి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.