VZM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇళ్లు లేని నిరుపేదల కోసం 100% డిమాండ్ సర్వే జరుగుతోందన్నారు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 30 వరకు మాత్రమే గడువు ఉందన్నారు.