టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో, దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ స్పిన్నర్ కాలిన్ బ్లైత్ 59 వికెట్లతో ఉండగా, జడేజా 52 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.