W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని చినతాడేపల్లి, పెదతాడేపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో సోమవారం ‘రైతన్నమీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఏడీ గంగాధరరావు, ఏవో పి. నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్‌పై అవగాహన కల్పించారు. రైతుల ఫోన్లలో వ్యవసాయ సమాచార యాప్ 2.0ను నిక్షిప్తం చేశారు.