KMM: ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించడమే మంత్రి ధ్యేయమని కార్పొరేటర్ కన్నం వైష్ణవి తెలిపారు. మంత్రి తుమ్మల సిఫార్సు మేరకు ఖమ్మం 46వ డివిజన్‌కు చెందిన నిరంజన్‌కు రూ. 60 వేలు, రుద్ర సదానందంకు రూ. 32 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అవ్వగా సోమవారం ఆమె నగర కాంగ్రెస్ ఓబీసీ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు.