NLG: జిల్లా వ్యాప్తంగా ప్రవేట్ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలుగా మారాయి. రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. పెద్దపూర మండలం లింగాపల్లి గ్రామానికి చెందిన జ్యోతి ఇటీవల నల్లగొండలోని ఓ ఆసుపత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. వారి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపించింది.