SRPT: కోదాడ నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నేడు 12 గంటలకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పంపిణీ చేస్తారని మంగళవారం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు సకాలంలో అందుబాటులో ఉండాలని సూచించారు.