VZM: రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు ఇవాళ స్దానిక RTC కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించి రుచి, నాణ్యతలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.