అనంతపురం: జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెడ్-కుక్గా పనిచేస్తున్న నాగభూషణం అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ చెన్నారెడ్డితో పాటు యూనివర్సిటీ డైరెక్టర్లు భానుమూర్తి, వైశాలి, సుజాత, సత్యనారాయణలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.