GNTR: మంగళగిరిలోని వీటీజెేఎమ్ డిగ్రీ కళాశాలలో ఈనెల 29న మెగా జాబ్ మేళా జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విడుదల చేశారు. పది నుంచి పీజీ, బి.టెక్ అర్హత ఉన్న 18-25 ఏళ్ల యువత దీనికి అర్హులు. మొత్తం 10 కంపెనీల్లో 262 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం లభిస్తుంది.