WGL: నల్లబెల్లి మండలంలోని గుండ్లపాడు IKP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మాల్సిందిగా రైతులకు సూచించారు.