MBNR: బీసీలను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోసం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటించి, ఆ తర్వాత వాటిని మరచిపోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. బీసీ డిక్లరేషన్లో కేవలం 42 శాతం రిజర్వేషన్లే కాకుండా, మిగతా హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు.