VSP: విశాలాక్షినగర్ పరిధిలోని కోళ్ల ఫారం వద్ద అర్ధరాత్రి 25 నాటు కోళ్లు చోరీకి గురయ్యాయని యాజమాని నారాయణరావు తెలిపారు. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ఐరెన్ గ్రిల్ డోర్ తాళాలు పగొలగొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.