SDPT: తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం వడ్డీలేని రుణాలను అందిస్తోందని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఐఓసీలో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందజేశారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన మొత్తం 3,718 స్వయం సహాయక సంఘాలకు గాను రూ.3 కోట్ల 99 లక్షల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు.