CTR: వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా పుంగనూరు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు హాజరుకావాలని కోరారు.