KRNL: బ్రాహ్మణ సమాజంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేసిన పీ.రమణ, జీడీ నరసయ్య, నాస్తికుల బృందాన్ని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బాబూరావు ఖండించారు. మంగళవారం పెద్దకడబూరు మండలం గంగులపాడులో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో బ్రాహ్మణుల ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.