SIRపై తమ సమస్యలను తెలిపేందుకు అవకాశం కల్పించాలంటూ టీఎంసీ రాసిన లేఖపై ఈసీ స్పందించింది. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఢిల్లీ అశోక రోడ్డులో ఉన్న కార్యాలయానికి రావాలని తెలిపింది. ఆఫీసులో పరిమిత స్థలం ఉన్నందున పార్టీకి చెందిన నలుగురు సభ్యులకే అనుమతిని ఇస్తునట్లు చెప్పింది. సభ్యుల పేర్లతో పాటు వాహనాలు వివరాలను ముందుగానే తెలపాలని సూచించింది.