HYD: బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామంటూ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందని తెలిపారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.