AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈనెల 29 నుంచి కోస్తాలో భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొన్నారు.