టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ ముందు 548 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు. క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. మరో ఒక్కటిన్నర రోజు ఆట మిగిలున్న నేపథ్యంలో భారత బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.