ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్జీనియా పొగాకు రైతు మువ్వ సాంబశివరావు మృతి చెందారు. టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన సాంబశివరావు, జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తుండగా, వేరొక మోటార్ సైకిల్ ఆయన మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.