TG: GHMC కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. మజ్లిస్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. వందేమాతరం, జయజయహే తెలంగాణ గీతాలపన సమయంలో MIM కార్పొరేటర్ కూర్చొనే ఉండటంతో వివాదం మొదలైంది. నిలబడకుండా అవమానించారంటూ బీజేపీ సభ్యులు అభ్యతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుర్చీలపైకి ఎక్కి బీజేపీ, మజ్లిస్ సభ్యులు ఆందోళనకు దిగారు.