W.G: దెందులూరు ఎంపీడీవోగా వీర ప్రతాప్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఏవోగా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై దెందులూరు వచ్చారు. దెందులూరు మండల పరిషత్ కార్యాలయం ఇంఛార్జ్ ఎంపీడీవో భీమరాజు నుంచి వీర ప్రతాప్ బాధ్యతలు తీసుకున్నారు. అందరి సహకారంతో దెందులూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పలువురు అధికారులు ఆయనని కలిసి అభినందనలు తెలిపారు.