BDK: బయ్యారం మండలం పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చెరువులో చేప పిల్లలను వదిలారు. బయ్యారం పెద్ద చెరువులో వరద వలన నష్టపోయిన మత్స్య రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.