AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విద్యార్థిని బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. బెంగళూరులోని ఆచార్య కళాశాలలో దేవశ్రీ డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు చిత్తూరు జిల్లా పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, దేవశ్రీని అతడే హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు.