BHPL: జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం నాలుగో రోజుకు చేరింది. గతంలో 37 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చినా రెండేళ్లు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించకపోవడ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘ నాయకులు పాల్గొన్నారు.