GNTR: తెనాలిలో సందేశాత్మక కథాంశంతో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ మంగళవారం సందడిగా ప్రారంభమైంది. రోటరీ క్లబ్ సమర్పణలో ఈదర టాకీస్ నిర్మాణ సారాధ్యంలో ‘రీబూట్’ పేరుతో చిత్రీకరిస్తున్న షార్ట్ ఫిలిం తొలి సన్నివేశానికి కళాకారుల సంఘ అధ్యక్షురాలు బుర్ర జయలక్ష్మి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.