CTR: నిండ్ర మండలంలోని అగరం పేట గ్రామానికి చెందిన YCP వార్డు సభ్యుడు వడివేలు తండ్రి గోపాల్ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి రోజా మంగళవారం పరామర్శించారు. వడివేలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.