అయోధ్య రామాలయంలో ధ్వజరోహణం కార్యక్రమం అనంతరం జైశ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘భారతీయ సంస్కృతికి చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచింది. రామభక్తుల సంకల్పం సిద్ధించింది. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి. ధర్మధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం’ అని తెలిపారు.