అయోధ్య రామాలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ధర్మధ్వజాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కాషాయవర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో తయారు చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది. గుజరాత్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తీర్చిదిద్దింది.