KMM: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు అమర్లపూడి శరత్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా SKM ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం అమలు చేయాలన్నారు.