AKP: తాగునీరు నీరు వృథా కాకుండా పంచాయతీ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం రామచంద్రపాలెం గ్రామంలో పర్యటించి మంచినీటి కుళాయిలు పరిశీలించారు. మంచినీటి ట్యాప్‌ల వద్ద పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను ఏ విధంగా సేకరించాలో క్లాప్ మిత్రులకు అవగాహన కల్పించారు.