గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. 26/0 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా.. టీ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో జోర్జీ 21*, స్టబ్స్ 14* ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆధిక్యం 395 పరుగులకు చేరింది.