KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి మంగళవారం పట్టణంలోని 2వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు, రోడ్డు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రజలు ఆస్తి పన్ను తప్పక చెల్లించాలని కమిషనర్ కోరారు.